ఢిల్లీలోని జామియా జామియా ఇస్లామియా యూనివర్సిటీ ప్రాంతంలో సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ విషయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికెళ్లింది. వెంటనే స్పందించిన ఆయన ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించరాదని, కఠిన చర్యలు తీసుకుంటేనే మరోసారి ఇలాంటివి జరుగకుండా ఉంటాయని తేల్చిచెప్పారు. ‘‘నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించా. ఇలాంటి సంఘటనలను కేంద్రం ఎంతమాత్రం ఉపేక్షించదు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం. విడిచి పెట్టే ప్రసక్తే లేదు’’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.

మహాత్మా గాంధీ వర్థంతి రోజే ఢిల్లీలో ఓ ఉన్మాది కాల్పులతో రెచ్చిపోయాడు. సీఏఏకి వ్యతిరేకంగా శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నవిద్యార్థులపై దుండగులు కాల్పలకు తెగబడ్డాడు. దీంతో జామియా ఇస్లామియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అజాదీ కావాలా అంటూ దుండగుడు ఆందోళనకారులపై కాల్పులు జరిపాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒక విద్యార్థికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గాయాపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దుండగుడు అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో జనాలు భయాందోళన చెంది పరుగులు తీశారు. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లీంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దుండగుడు నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను.. ఎవరికి కావాలి ఆజాదీ.. జై శ్రీరాం అంటూ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.