రహస్య పరిశోధన కోసం అమెరికా వైమానిక దళం పంపిన ఎక్స్-37బి వ్యోమనౌక రెండేళ్ల పాటు రోదసిలో గడిపిన తరువాత భూమికి తిరిగి వచ్చింది.

780 రోజుల పాటు కక్ష్యలో ఉన్న తరువాత, ఈ అంతరిక్ష నౌక ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలో దిగింది.

ఇన్నిరోజుల పాటు ఆ నౌక రోదసిలో ఏమి చేసిందా అనే విషయాలను అమెరికా గోప్యంగా ఉంచింది. తమ లక్ష్యాలన్ని నెరవేరాయని మాత్రమే చెప్పింది.

అమెరికా వైమానిక దళ లాబొరేటోరీకి సంబంధించిన కొన్ని ప్రయోగాలు ఇందులో జరిగినట్టు తెలుస్తోంది. దీనిని రోదసిలోకి పంపడం ఇది ఐదోసారి.

సత్య ప్రియ బి.ఎన్

One comment on "భూమి కి తిరిగి వచ్చిన అమెరికా ‘రహస్య వ్యోమనౌక’ !"

Comments are closed.