అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ దగ్గర తప్పిన ప్రమాదం..!
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 23 Sept 2019 4:07 PM IST

హైదరాబాద్: అమీర్‌పేట్‌లో ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో రోడ్డు మీద ఉన్న జనం పరుగులు తీశారు. టైర్ పంక్చర్ కావడంతో బస్సు అదుపు తప్పింది. దీంతో బస్సు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. అదే ఊపులో పక్కనే ఉన్న షాపులోకి దూసుకెళ్లింది. అదృష్టం కొద్దీ ఉదయం రద్దీ తక్కువ కావడంతో పెను ప్రమాదం తప్పింది.
సికింద్రాబాద్ నుంచి మియాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సలో15 మంది ఉన్నారు .వీరిలో నలుగురుకి గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పెచ్చులూడి మౌనిక అనే వివాహిత మీద పడటంతో ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే.
Next Story