అమీర్‌పేట్‌లో డ్రగ్‌ కలకలం.. పట్టుబడిన ముఠా

By సుభాష్  Published on  9 Sep 2020 1:46 AM GMT
అమీర్‌పేట్‌లో డ్రగ్‌ కలకలం.. పట్టుబడిన ముఠా

హైదరాబాద్‌లో మరో డ్రగ్‌ గ్యాంగ్‌ పట్టుబడటం కలకలం రేపింది. అమీర్‌పేట్‌లో ముగ్గురు వ్యక్తుల నుంచి ఎక్సైజ్‌ పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి నగరానికి డ్రగ్‌ సరఫరా చేసి స్టాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులకు చేరవేస్తున్న బంటీ గ్యాంగ్‌ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బంటీ ముఠా సభ్యుల నుంచి ఎక్స్‌ స్టసి పిల్స్‌ 46 గ్రాములు, 2 గ్రాముల ఎండీఎంఏ, 10 గ్రాముల చరస్‌ స్వాధీనం చేసుకున్నారు. బంటీ ముఠాతో పాటు నగరానికి చెందిన రోహిత్‌, నవీన్‌రాజ్‌ డ్రగ్‌ కోసం గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. గోవాకు చెందిన రఫీ, కునాల్‌ ఇద్దరు ముఠా సభ్యులు బంటీ గ్యాంగ్‌ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

అలాగే నిందితుల నుంచి ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. అయితే ముఠా సభ్యులు నగరంలో ఎవరెవరికి డ్రగ్‌ సరఫరా చేశారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story
Share it