ముఖ్యాంశాలు

  • నిబంధనలు ఉల్లంఘిస్తున్న అంబులెన్స్‌ యజమానులు
  • హైదరాబాద్‌- విజయవాడ మధ్య అంబులెన్సుల్లో ప్రయాణికుల తరలింపు
  • ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.1000 వసూలు
  • అంబులెన్స్‌లు కావడంతో క్లియరెన్స్‌ ఇస్తున్న పోలీసులు

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. కరోనా కట్టడికి పూర్తిగా కళ్లే వేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే లాక్‌డౌన్‌లో అత్యవసర సేవలకు ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. ఇదే అదనుగా ప్రైవేట్‌ అంబులెన్స్‌లు సోమ్ము చేసుకుంటున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో తెలంగాణ-ఆంధ్రా బార్డర్‌ మీదుగా ప్రయాణికులను అంబులెన్స్‌ త్వారా తరలిస్తున్నారు. పేషంట్ల ముసుగులో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు మనిషికి వెయ్యి రూపాయల చొప్పున చార్జీలు వసూలు చేస్తూ రాకపోకలు సాగిస్తున్నారు. అయితే అత్యవసర సేవల్లో భాగంగా అంబులెన్స్‌లు కనపడగానే పోలీసులు క్లియరెన్స్‌ చేస్తున్నారు. దీంతో అంబులెన్స్‌ డ్రైవర్‌లు గట్టు చప్పుడు కాకుండా రవాణా కొనసాగిస్తున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ఇరు రాష్ట్రాల సరిహద్దులను మూసివేశాయి. అలాగే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును కూడా పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ప్రైవేట్‌ ప్యాసింజర్‌ వాహనాల సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప వాహనాలను రోడ్డుపైకి అనుమతించడం లేదు. అయితే వైద్య చికిత్సకు మాత్రం ఇందుకు మినహాయింపు కల్పించారు. కోదాడలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అంబులెన్స్‌ డోర్‌ను ఓపెన్‌ చేసి చూశారు. అందులో సాధారణ ప్రయాణికులు ఉండడం చూసి షాక్‌ అయ్యారు. దీంతో అంబులెన్స్‌ డ్రైవర్‌ని తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.