పవన్ కల్యాణ్ ను మించిన మహానటుడు చంద్రబాబు : అంబటి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 11:40 AM GMT
పవన్ కల్యాణ్ ను మించిన మహానటుడు చంద్రబాబు : అంబటి

ముఖ్యాంశాలు

  • ఢిల్లీకి చంద్రబాబు దూతగా పవన్ వెళ్తున్నాడా?: అంబటి
  • చంద్రబాబు ఇసుక దీక్ష ఓ దొంగ దీక్ష :అంబటి
  • చంద్రబాబు ఇసుక దీక్షకు ఆయన ఎమ్మెల్యేలే హాజరు కాలేదు:అంబటి

అమరావతి: ఇసుక కొరతపై చంద్రబాబు చేసింది దొంగ దీక్ష అంటూ మండిపడ్డారు వైఎస్ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఆరు నెలలు అధికారం లేకపోయేసరికి చంద్రబాబు ప్రస్టేషన్ లో ఉన్నారన్నారు. ఆరు నెలల్లోనే చంద్రబాబు వికృత రూపం బయటపడిందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రి, పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నవ్యక్తి ఇసుకదీక్షతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పలుగు,పారలు కెమెరాలకు కనబడేలా చేయాలని దీక్షలో కూర్చున్నవారికి చంద్రబాబు డైరక్షన్ చేశారని..ఇదేనా దీక్ష అంటే అంటూఅంబటి మండిపడ్డారు. బొచ్చా,పార పట్టుకున్నవారినే కాదు పవన్ కల్యాణ్ తో సైతం బాగా నటింపజేశారన్నారు.

151 సీట్లతో వైఎస్ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే...ఆరు నెలల్లోనే చంద్రబాబు కంగారు పడుతున్నారని ఎద్దేవా చేశారు అంబటి. పొలిటికల్ అవినీతిని అరికట్టడానికి సీఎం వైఎస్‌ జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అలా చేస్తుంటే జే టాక్స్ అని మాట్లాడతారా అంటూ అంబటి మండిపడ్డారు. 50 మంది భవన నిర్మాణకార్మికులు చనిపోయారని ప్రచారం చేస్తున్నారని ఎక్కడ చనిపోయారో చెప్పాలన్నారు. లోకేష్ , చంద్రబాబులు శవరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు అంబటి.

చంద్రబాబు ఆదేశాలమేరకు పవన్ కల్యాణ్ నడుస్తున్నారని ఆరోపించారు అంబటి. పవన్ కల్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అంబటి చెప్పారు.తాటతీసి మూలన కూర్చోబెడతాను.జగన్ 16 నెలలు జైలులో ఉన్నారు..అంటూ మాట్లాడిన మాటలు వ్యక్తిగతమా..?పాలసీలపై మాట్లాడటమా..? అని ప్రశ్నించారు అంబటి. సీఎం జగన్ ను విమర్శిస్తున్న పవన్‌కు ఎక్కడ నుంచి ప్యాకేజీలు వస్తున్నాయో అందరికీ తెలుసన్నారు. వైఎస్ జగన్ హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ ను ఢిల్లీకి చంద్రబాబు తన దూతగా పంపించి ఉంటాడని తన అనుమానం అన్నారు అంబటి. పవన్ మాత్రం రాష్ర్ట ప్రయోజనాలకోసం వెళ్తున్నాడని తాను భావించడంలేదన్నారు. ఢిల్లీ వెళ్లివచ్చాక పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్లాడో చెప్తాడని ఆశిస్తున్నానన్నారు అంబటి.

Next Story