ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంచాలని గత 18 రోజులుగా రైతులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. మరో వైపు వివిధ ప్రజా సంఘాలు, టీడీపీ, వామపక్షాలు ర్యాలీలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాజధాని రైతులు, మహిళలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కలిశారు. సికింద్రాబాద్‌లోని కార్యాలయంలో రైతులు మంత్రిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ కిషన్‌ రెడ్డిని రైతులు వేడుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలని మంత్రికి విన్నవించారు. వారి విన్నపాన్ని విన్న కిషన్‌రెడ్డి  సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని, రాజధాని అమరావతిలోనే ఉండే విధంగా చర్యలు చేపడతానని రైతులకు హామీ ఇచ్చారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.