అమరావతిలో వ్యభిచార దందా..

By రాణి  Published on  11 March 2020 10:08 AM GMT
అమరావతిలో వ్యభిచార దందా..

అమరావతి పరిధిలో జరుగుతున్న వ్యభిచార దందా గుట్టు రట్టయింది. వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేయగా..ముగ్గురు అరెస్టయ్యారు. చిన కాకాని గ్రామ పంచాయతీ పరిధిలోని రాజ్ కమల్ రోడ్డులో ఇద్దరు మహిళలు ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కొంతకాలంగా ఆ ఇంటిలోనే వ్యభిచారం నడిపిస్తున్నారు. నిత్యం వేర్వేరు వ్యక్తులు ఆ ఇంటికి వచ్చిపోతుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

Also Read : 6వ తరగతి బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. బట్టలు చింపి మరీ..

వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారం తెలుసుకున్న మంగళగిరి రూరల్ సీఐ పి.శేషగిరిరావు, ఎస్ ఐ శ్రీనివాసరెడ్డి తన బృందంతో వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఇద్దరు మహిళలతో పాటు ఓ విటుడిని అరెస్ట్ చేసి, రూ.4వేల నగదును, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Also Read : ప్రియుడితో ఏకాంతంగా..రహస్య వీడియోలు లీక్

కేసు నమోదు చేసిన పోలీసులు..ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలను చినకాకానికి రప్పించి ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలిందన్నారు. ఇంకా ఈ ఊబిలో ఎవరెవరున్నారన్న విషయం తెలియాల్సి ఉందన్నారు. ఎంత మంది ఉన్నా..వీరి వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నా తేల్చి చెప్పారు.

Next Story
Share it