అమరావతి: రాజధాని భూముల్లో ఇన్‌ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆరా తీసే పనిలో పడింది. రాజధాని ప్రకటించిన తరువాత భూములు కొన్నవారు, అమ్మిన వారి వివరాలను సీఐడీ అధికారులు సేకరిస్తున్నారు. గత మూడు రోజులుగా సీఐడీ అధికారులు కృష్ణా జిల్లాలోని వీరులపాడు , చెవిటి కల్లు మండలాల్లో వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.  2014-15 భూములు అమ్మిన, కొన్న వారి వివరాలతో సీఐడీ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఎంతకు అమ్మారు..? ఎంత పొలం అమ్మారు…? ఎప్పుడు అమ్మారు? అనే వివరాలు రైతుల నుంచి సీఐడీ అధికారులు తీసుకుంటున్నారు. భూములు కొన్న వ్యక్తులే రైతులు దగ్గరకు వచ్చారా? లేక బీనామీలు ఉన్నారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Image result for amaravathi lands

ఇటీవల భూములు అమ్మిన గని ఆత్కూరు రైతులు ముక్కపాటి నాగేశ్వరరావు, రాయల పేరయ్యల నుంచి కొంత సమాచారం అధికారులు తీసుకున్నారు. భారీ స్థాయిలో వేసిన వెంచర్లలోకి వెళ్లిన అధికారులు అవి వేసిందెవరు ? ప్లాట్లు కొన్నదెవరు? అనే వివరాలు సేకరిస్తున్నారు. ఎంపీ సుజనా చౌదరి, బాలకృష్ణ వియ్యంకుడు కృష్ణా జిల్లాలో రాజధాని భూములు కొన్నారని ఇప్పటికే మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.