అమలాపాల్ కొత్త ప్రియుడు ఇతడేనా..?
By తోట వంశీ కుమార్ Published on 11 March 2020 4:51 PM ISTనటీ అమలాపాల్ 2014లో దర్శకుడు ఎఎల్ విజయ్‌ను ప్రేమించి వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం విజయ్ విజయ్ ఇటీవల ఓ డాక్టర్ ని రెండో వివాహం చేసుకున్నాడు. అయినప్పటికి హీరోయిన్ అమలాపాల్ ఒంటరిగా ఉంటోంది. అయితే ఓ ఇంటర్వూలో మాత్రం తన జీవితంలోకి మరో వ్యక్తిని తప్పక ఆహ్వానిస్తానని చెప్పింది. అంతేకాదు అతడు తనకు తోడుగా ఉన్నాడని.. తన కెరీయర్ విషయంలో అతని సలహాలే పాటిస్తున్నాను అని చెప్పింది. అయితే అతడి వివరాలు మాత్రం చెప్పలేదు. దీంతో అతడు ఎవరై ఉంటారు అనే ఊహాగానాలు చాలానే వచ్చాయి.
తాజాగా ముంబాయికి చెందిన గాయకుడు భవిందర్ సింగ్‌తో అమలాపాల్ డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే వీరిద్దరు కలిసి దిగిన పోటోలను అతడు పలు మార్లు సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. నా బేబి స్వస్థలంలో ఈస్టర్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నా అంటూ ఓ అమ్మాయితో ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన భవిందర్ ఆపోటోలను డిలీట్ చేశాడు. అయిన్పపటికి వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ వార్తలపై వీరిద్దరు ఇప్పటి వరకు స్పందించలేదు.
ఇదిలా ఉండగా.. ఇటీవల కమర్షియల్ చిత్రాలని తగ్గించిన అమలాపాల్ లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది. అమలాపాల్ ప్రస్తుతం తమిళంలో 'ఆదో అంధా పారవై పోలా'- 'కేడవర్'.. చిత్రాలు చేస్తోంది. మలయాళంలో 'ఆడుజీవితమ్'.. తెలుగులో 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ రీమేక్ లో నటిస్తూ బిజీగా ఉంది