తన బాడీగార్డు బర్త్ డే వేడుకను జరిపిన అల్లు అర్జున్‌

By అంజి
Published on : 14 March 2020 7:55 PM IST

తన బాడీగార్డు బర్త్ డే వేడుకను జరిపిన అల్లు అర్జున్‌

ముఖ్యాంశాలు

  • తన బాడీగార్డు పుట్టినరోజు వేడుక నిర్వహించిన అల్లు అర్జున్‌
  • బాడీగార్డుకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చాడని సమాచారం
  • హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్‌తో అల్లు అర్జున్‌ సినిమా

హీరో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. తన బాడీగార్డు బర్త్‌ వేడుకను నిర్వహించాడు. బాడీగార్డుతో కేక్ కట్‌ చేయించాడు. ఆ తర్వాత పుట్టిన రోజు సందర్భంగా తన నుంచి ఓ అదిరిపోయే గిఫ్ట్‌ కూడా ఇచ్చారని తెలిసింది. కాగా బాడీగార్డు బర్త్‌ వేడుకల్లో స్టైలిష్‌ అల్లు అర్జున్‌ లుక్‌ అదిరిపోయింది. అల్లు అర్జున్‌ కొత్త లుక్‌తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. బాగా గడ్డం పెంచి రఫ్‌ లుక్‌తో కనిపిస్తున్న బన్నీ.. ప్రస్తుతం సుకుమార్‌ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోంది.

Allu Arjun bodyguard birthday party

లారీ డ్రైవర్‌ పాత్రలో మాస్‌ లుక్‌లో అల్లు అర్జును కనిపించనున్నాడు. యాక్షన్‌ అండ్‌ సస్పెన్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్‌ పూర్తైందని తెలిసింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌కు సంబంధించి కొత్త ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు.

Allu Arjun bodyguard birthday party

Next Story