ఆ ఒక్క సీన్ లేకుంటే 'అల వైకుంఠ‌పురం చాప చుట్టేసేద‌ట‌'

By Newsmeter.Network  Published on  18 Jan 2020 5:14 AM GMT
ఆ ఒక్క సీన్ లేకుంటే అల వైకుంఠ‌పురం చాప చుట్టేసేద‌ట‌

సంక్రాంతి సంద‌ర్భంగా టాలీవుడ్ బాక్సాఫీసు ద‌గ్గ‌ర విడుద‌లైన అల వైకుంఠ‌పురం సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. నా పేరు సూర్య వంటి దారుణ‌మైన డిజాస్ట‌ర్ త‌రువాత రిలీజైన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. మాటల‌ మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం తెర‌కెక్క‌డంతో ఓవర్సీస్‌లో క‌ళ్లు చెదిరే క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొట్టింది.

అయితే, సినిమాలో పెద్ద విష‌య‌మేమీ లేద‌ని, త్రివిక్ర‌మ్ సినిమాలో అన్నీ ఏ విధంగా ఉంటాయో, ఆ విధంగానే అల వైకుంట‌పురం సినిమా ఉంద‌ని స‌గ‌టు ప్రేక్ష‌కుడు త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నాడు. సినిమాకు మేజ‌ర్ హైలెట్ విష‌యానికొస్తే, టాలీవుడ్ స్టార్ హీరోల సాంగ్‌ల‌కు అల్లు అర్జున్ స్టెప్పులు వేసే స‌న్నివేశం సినిమాకే హైలెట్ అని, ముఖ్యంగా వ‌చ్చాడ‌య్యో సామి సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు పాట‌కు బ‌న్నీ స్టెప్పులేయ‌డం ఎవ‌రూ ఊహించ‌లేనిద‌ని, ఆ త‌రువాత ఫాలో.. ఫాలో.. ఫాలో అంటూ నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో తార‌క్ వేసిన స్టెప్పులు బ‌న్నీ వేస్తాడు. ఆ వెంటనే ఉండి పోరాదే పాట వ‌స్తుంది. ఇలా టాలీవుడ్ హిట్ సాంగ్స్‌కు స్టెప్పులేసి మెప్పించాడు బ‌న్నీ.

ఆ త‌రువాత న‌టుడు సునీల్ లైన్‌లోకి వ‌చ్చి, ఇన్ని పాట‌ల‌కు స్టెప్పులేశావ్, మా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాట‌కు స్టెప్పులేయ‌వా..? అని అడిగితే గ‌బ్బ‌ర్‌సింగ్‌లోని పిల్లా నువ్వులేని జీవితం పాట‌కు అచ్చం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాదిరి అల్లు అర్జున్ స్టెప్పులేయ‌డం, చివ‌రాఖ‌ర్లో విల‌న్‌ను ఒక దెబ్బ‌కొట్టి అబ్బ‌ని.. తియ్య‌ని పాట‌కు స్టెప్పేసి పెద్దాయ‌న పాట‌లు లేకుంటే ఎట్లా అంటూ ఆ ఎపిసోడ్‌కు అదిరిపోయే క‌ల‌రింగ్ అల్లు అర్జున్ తీసుకురావ‌డంతో సినిమా మొత్తానికి అదే హైలెగా నిలిచింది.

హీరోల పాట‌ల‌కు అల్లు అర్జున్ డ్యాన్స్ చేయ‌డం వ‌ల్లే ఉండ‌టం వ‌ల్లే అంద‌రి అభిమానులు సినిమాకు వ‌స్తున్నార‌ని, లేకుంటే అల వైకుంఠ‌పురం థియేట‌ర్ల నుంచి ఎప్పుడో స‌ర్దుకుపోయే టైమ్ వ‌చ్చేద‌ని సినిమా చూసిన చాలా మంది ప్రేక్ష‌కులు సోష‌ల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అల వైకుంఠ‌పురం సినిమాతో పోలిస్తే, గ‌తంలో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ న‌టించిన రెండు సినిమాలు చాలా బాగున్నాయ‌ని, స‌గ‌టు ప్రేక్ష‌కులు అంటున్నారు. అయితే, ఈ సీన్ లేక‌పోతే సినిమా ఓ మాదిరిగా ఉండేదంటూ అల్లు అర్జున్ సైతం ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకురావ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Next Story
Share it