అలీ రీ ఎంట్రీ.. మిత్రులు కాస్త శత్రువులయ్యారా..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Sep 2019 9:08 AM GMTగురువారం బిగ్‌బాస్ ఎపిసోడ్ విచిత్రంగా సాగింది. మంచి స్నేహితులుగా ఉండాల్సిన రాహుల్-పునర్నవి, వరుణ్-వితికాలు శత్రువులు అయిపోయారు. వర్షం పడుతుండటంతో అందరూ జంటలుగా పాటలకు డ్యాన్స్ వేసి అదరగొట్టారు. కెప్టెన్సీ టాస్క్ లో ఇటుక గోడ కట్టే పోటీలో శ్రీముఖీ, రవి గెలిచారు. బాబా భాస్కర్ ను బెస్ట్ పర్ఫార్మర్ గా అందరూ ఎన్నుకున్నారు. దీనితో రవి, శ్రీముఖి, బాబా భాస్కర్, శివజ్యోతి లను కెప్టెన్ పోటీదారులుగా బిగ్ బాస్ ప్రకటించారు.
బిగ్‌బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రి ద్వారా అలీ రజా అదిరిపోయే డ్యాన్స్ తో ఎంట్రీ ఇచ్చాడు. అలీ రీ-ఎంట్రీ తో శ్రీముఖీ, శివజ్యోతి భావోద్వేగానికి లోనయ్యారు. శివజ్యోతి కన్నీరు కారుస్తోంటే అలీ ఆమెను సముదాయించాడు.
Next Story