2020 లో ఇంకో షాకింగ్ న్యూస్.. అవును వాళ్లు భూమి మీదకు వచ్చారు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 April 2020 9:30 AM GMT
2020 లో ఇంకో షాకింగ్ న్యూస్.. అవును వాళ్లు భూమి మీదకు వచ్చారు..!

నెటిజన్లను ఒకసారి మీకు ఏ సంవత్సరం చాలా కఠినంగా అనిపించింది అని అడిగితే.. చాలా మంది 2020 అనే అంటారు. ఎందుకంటే ఈ సంవత్సరం మొదటి నెల నుండి చోటుచేసుకుంటున్న ఘటనల విషయమై వాళ్ళు ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. వరల్డ్ వార్ వస్తుందని మొదటి నెలలో భయపడ్డారు, ఆ తర్వాత ఆస్ట్రేలియా కార్చిచ్చు, ఆ తర్వాత కరోనా మహమ్మారి. కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ ను అమలు చేయడం.. ఇప్పటికే చాలా వరస్ట్ గా 2020 ఉంది అనుకుంటున్న వాళ్ళకు మరో షాకింగ్ వార్త బయటకు వచ్చింది.

అన్ ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్(యుఎఫ్ఓ).. లేదా ఫ్లైయింగ్ సాసర్లు ఉన్నాయంటూ అమెరికా నేవీ అంగీకరించింది. యుఎఫ్ఓ లు ఉన్నాయన్నది నిజమేనని ఒప్పుకుని అందరినీ షాక్ కు గురిచేసింది. మొత్తం మూడు వీడియోలను అమెరికా నేవీకి చెందిన పైలట్లు చిత్రీకరించినవేనని పెంటగాన్ అంగీకరించింది. గతంలోనే ఓ కంపెనీ ద్వారా ఈ వీడియాలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలలో ఉన్నవి యుఎఫ్ఓ లు.. అవి చాలా వేగంగా ప్రయాణించడం తాము చూశామని అన్నారు. ఈ మూడు వీడియోలను బయటకు విడుదల చేయడం కారణంగా రహస్యాలు ఏమీ బయటకు పొక్కవని.. గగనతలంలో అనూహ్యమైనవి చోటుచేసుకున్నాయని తాము గమనించామని అన్నారు. ఖచ్చితంగా అవి యుఎఫ్ఓలే అని.. చాలా వేగంగా అవి ప్రయాణించడం తమ పైలట్లు రికార్డు చేశారని పెంటగాన్ స్పష్టం చేసింది.

గత కొన్నేళ్లుగా వివిధ మాధ్యమాల్లో ఈ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ వీటిపై యుఎస్ నేవీ ఎటువంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. చాలా మంది ఇవి ఏలియన్స్ కు చెందిన వాహనాలేనని చెప్పుకొచ్చారు. ఈ వీడియోలు 2007, 2017 సంవత్సరాల్లో బయటకు వచ్చాయి. ఆకాశంలో చోటుచేసుకున్న ఈ ఘటనలపై అప్పట్లో నోరు మెదపని యుఎస్ నేవీ ఇప్పుడు ఆ వీడియోలు నిజమేనని ఒప్పుకుంది. మొత్తం మూడు వీడియోలలో యుఎఫ్ఓ లు అతి వేగంతో ప్రయాణించడం గమనించవచ్చు.

మూడు వీడియోలలో పైలట్లు ట్రైనింగ్స్ లో ఉండగా యుఎఫ్ఓ లు వేగంగా వెళ్లడం గమనించారు. 2004, 2015 లో రికార్డు అయినట్లు చెబుతున్నారు. రెండు వీడియోలను న్యూ యార్క్ టైమ్స్ 2017 లో ప్రచురించింది.

పెంటగాన్ విడుదల చేసిన వీడియోల ద్వారా ఈ విశ్వం మీద ఉన్నది మనం మాత్రమే కాదని అర్థమవుతుంది. ఇతర గ్రహాల్లో జీవరాశిపై విపరీతమైన అన్వేషణ జరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు గ్రహాంతరవాసులు భూమి మీదకు వచ్చారని తెలియడంతో నెటిజన్లు షాక్ లో ఉన్నారు. ట్విట్టర్ లో పెంటగాన్, యుఎఫ్ఓ ల గురించి తెగ చర్చ జరుగుతోంది.Next Story