ఇస్కాన్‌ ఆలయాన్ని దర్శించుకున్న టీఓవీపీ ప్రెసిడెంట్‌ అల్పాడ్‌ ఫోర్డ్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Oct 2019 6:29 AM GMT
ఇస్కాన్‌ ఆలయాన్ని దర్శించుకున్న టీఓవీపీ ప్రెసిడెంట్‌ అల్పాడ్‌ ఫోర్డ్‌

హైదరాబాద్‌: కలకత్తా మాయాపూర్‌లో వంద మిలియన్ల డాలర్లతో నిర్మిస్తున్న అతి పెద్ద క్రిష్ణ మందిర్‌ ప్రచారంలో భాగంగా టెంపుల్‌ ఆఫ్‌ వైదిక్‌ ప్లానిటోరియం (టీఓవీపీ) ప్రెసిడెంట్‌ హెచ్‌.డి అంబరీష్‌ దాస్‌ అలియాస్‌ అల్పాడ్‌ ఫోర్డ్‌ సికింద్రాబాద్‌ ఇస్కాన్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇస్కాన్‌ స్థాపక చైతన్య మహాప్రభు దాసు అభిషేకాన్ని నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రిష్ణ దాసులు పాల్గొన్నారు. ఇస్కాన్‌ ప్రచారకర్త వెంకటపతి దాసు మాట్లాడుతూ..హెచ్‌.డి అంబరీష్‌ దాసు మయాపూర్‌లో వెయ్యి కోట్ల రూపాయాలతో నిర్మిస్తున్న అతి పెద్ద కృష్ణ దేవాలయానికి 300 కోట్ల రూపాయాల విరాళాన్ని ఇచ్చారని తెలిపారు. టెంపుల్‌ నిర్మాణానికి ఇప్పటి వరకు 60 మిలియన్ల డాలర్లు సేకరించామని.. మిగతా 40 మిలియన్ల డాలర్లు సేకరించి హరే రామ హరే కృష్ణ భగవానుడి నామస్మరణను ప్రపంచ నలుమూలల విస్తరింపచేయడానికి ప్రపంచమంతా తిరుగుతూ హైదరాబాద్‌ వచ్చారని తెలిపారు.

ఇది కూడా చదవండి:

https://telugu.newsmeter.in/iskcon-donated-rs-300-crore-who-is-he/

ఇది కూడా చదవండి:

https://telugu.newsmeter.in/kalam-is-a-cosmopolitan/

Next Story
Share it