స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ –  స్టార్ డైరెక్టర్  త్రివిక్రమ్  కలయికలో ఈ రోజు వచ్చిన క్రేజీ సినిమా ‘అల వైకుంఠపురములో’.  ఈ సినిమా  పై బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా  భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
వాల్మీకి (మురళి శర్మ) తన స్వార్థంతో చేసిన ఓ పని వల్ల.. బంటు(అల్లు అర్జున్) సాధారణ మిడిల్ క్లాస్ వాడిగా బతకాల్సి వస్తోంది.  చిన్నప్పటి నుంచీ అలాగే పెరిగిన బంటుకు తన పుట్టుక గురించి  తన తల్లిదండ్రుల గురించి ఒక నిజం తెలుస్తుంది.  అలాగే సాధారణ కుటుంబం నుంచి వచ్చిన బంటు “వైకుంఠపురము”లోకి ఎలా అడుగు పెట్టాడు?  ఈ కథ వెనుక ఉన్న అసలు వృత్తాంతం ఏమిటి? ఇంతకీ బంటు తల్లిదండ్రులు ఎవరు? బంటు  అసలు కుటుంబం ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటుంది. దాంతో బంటు తన కుటుంబాన్ని ఆ సమస్యల నుండి ఎలా  బయట పడేశాడు? ఈ మధ్యలో బంటు అమూల్య (పూజా హెగ్డే) దగ్గర జాబ్ లో జాయిన్ అవుతాడు. అలాగే  ఆమెతో ప్రేమలో ఎలా   పడతాడు?   చివరికి తన ఒరిజనల్ తల్లిదండ్రులకు బంటు దగ్గర అవుతాడా లేదా?  అనేదే మిగిలిన కథ.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. వైకుంఠపురములో సినిమాని ఇద్దరే ఓ అందమైన దృశ్యకావ్యంలా తీర్చిదిద్దారు. వాళ్లే సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. పిఎస్ వినోద్ అయితే ప్రతి షాట్ ని ఓ పికాసో పెయింటింగ్ లా, అలా చూస్తూనే ఉండిపోవాలి అనేలా తీశారు. ఇక ఆ ప్రతి షాట్ కి ఓ అందమైన ఫ్రేమ్ కడితే ఎంత లుక్ వస్తోందో  అలా థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేసాడు. ఇక థమన్ పాటలు ఓ రేంజ్ లో హిట్  అయిన సంగతి తెలిసిందే. జులాయి చిత్రం తర్వాత ఈ చిత్రంలో త్రివిక్రమ్  కామికల్ టైమింగ్ ను మనం మరోసారి చూడొచ్చు.  అసలు  త్రివిక్రమ్ సినిమా అంటేనే డైలాగులు.. అయన మాటలు  కోసం ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తారు.  త్రివిక్రమ్ పేల్చినా డైలాగ్స్ కానీ ఫస్ట్ హాఫ్ లోని ఎమోషన్స్ కానీ ఈ చిత్రానికి  పెద్ద ఎస్సెట్. ప‌వ‌ర్ ఫుల్ పంచ్‌డైలాగులు బాగా పేలాయి. నిర్మాత  ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
నటీనటులు :
అల్లు అర్జున్ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో అద్భుతంగా నటించాడు. కొన్ని కామెడీ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో  ఆయన తన మార్క్  టైమింగ్ తో,  నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఇక పూజా ఒక్క గ్లామర్ తోనే కాకుండా మరోసారి మంచి పెర్ఫామెన్స్ ఇచ్చింది. అలాగే మురళీ శర్మ మంచి పాత్ర పోషించారు. టబు,జైరాం రోహిణీ లు తమదైన నటనతో ఆకట్టుకున్నారు.అలాగే నివేత పేతురాజ్ మరియు సుషాంత్ లు కూడా మంచి రోల్స్ చేసారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు సనీల్, హర్షవర్ధన్, వెన్నెల కిషోర్ కూడా  తమ నటనతో ఆకట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్ :
అల్లు అర్జున్ నటన
గుడ్ థీమ్
త్రివిక్రమ్ మార్క్ కామెడీ
మనసుకు హత్తుకునే ఎమోషనల్ సీన్స్
ఎంగేజింగ్ గా సాగే స్క్రీన్ ప్లే
థమన్ మ్యూజిక్
భారీ తారాగణం
మైనస్ పాయింట్స్ :
సెకెండ్ హాఫ్ వచ్చే ఊహాజనితమైన సీన్స్
 ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగడం
కొన్ని సీన్స్ గత సినిమాలను గుర్తు చేయడం
తీర్పు :
ఫైన‌ల్‌గా డీసెంట్ ఎమోషన్ తో  కూడిన ఫుల్ ఎంటర్టైనర్ గా సాగే  ఈ ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.  అలాగే ఈ సంక్రాంతికి బహుశా ఈ సినిమానే బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంది.
యూత్ తో పాటు  ఫ్యామిలీస్ కూడా  ఈ సినిమాని చూడటానికి బాగా  ఇష్టపడతారు. కథ పరంగా గొప్పగా లేకపోయినా,  త్రివిక్రమ్ కామెడీ, డైలాగ్స్ అండ్ సినిమాలోని మెయిన్  ఎమోషన్స్  అద్భుతంగా ఉన్నాయి.
ఓవరాల్ గా అల్లు అర్జున్ భారీ సూపర్ హిట్ కొట్టాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.