అక్షయ తృతీయ అంటే.. బంగారం కొనడం మాత్రమేనా..!

By సుభాష్  Published on  26 April 2020 4:08 AM GMT
అక్షయ తృతీయ అంటే.. బంగారం కొనడం మాత్రమేనా..!

అక్షయ అంటే తరగనిది అని అర్థం. వైశాఖ మాసం శుక్ల పక్షం విదియను అక్షయ తృతీయగా పాటిస్తారు. అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం, పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేస్తుంటారు చాలా మంది. గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని అందరూ విశ్వసిస్తారు.

శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అన్ని ఐశ్వరాలకు అధినేత్రి. అమ్మవారి అనుగ్రహం ఉంటే జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. అందుకే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ రోజున పూజలు నిర్వహిస్తారు. భారతీయ సాంస్కృతిలో పసిడికి ఎక్కువగా విలువిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా మన దేశంలో అధిక ప్రాధాన్యత ఉంది. బంగారం అనేది సంపదకు చిహ్నం. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపదనతో వెల్లువిరుస్తుందని నమ్మకంతోనే బంగారాన్ని చాలా మంది కొనుగోలు చేస్తుంటారు.

ఏ పనులు చేసినా మంచి ప్రయోజనం కలుగుతుందని, దేవుడికి ఏది సమర్పించినా రెండింతలు సమకూరుతుందని నమ్ముతుంటారు. అందుకే ఎంతో కొంత బంగారం కొనాలని అనుకుంటారు. కానీ కొందరు పండితులు అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం సరైంది కాని కొట్టిపారేస్తుంటే.. మరి కొందరు ఎంతో కొంత పసిడి కొనాలని సూచిస్తున్నారు. కానీ ఎవరి నమ్మకం వారిదే అన్నట్లుగా ప్రజలకు నచ్చిన విధంగా చేస్తుంటారు.

Next Story