ముంబై: బాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలున్నారు. కానీ వాళ్ళలో ఖిలాడిగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ కాస్త డిఫరెంట్. కెరీర్ స్టారింగ్‌లో కేవలం యాక్షన్ సినిమాల హీరోగానే పేరు ఉన్నప్పటికీ గత కొన్నేళ్ళుగా తన ఇమేజ్ ని పూర్తిగా మార్చుకున్నాడు‌. అక్షయ్‌ కుమార్‌ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు. చిన్న హీరో స్థాయి నుంచి ఎదిగి బాలీవుడ్‌లో టాప్‌ హీరో స్థానాన్ని సంపాదించుకున్నాడు అక్షయ్‌ కుమార్‌. కామెడీ, యాక్షన్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌ అన్నింటిలోనూ హీరో అక్షయ్‌ కుమార్‌ తన సత్తా చూపారు. అక్షయ్ స్టంట్ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అక్షయ్‌ కుమార్‌ చాలా సినిమాల్లో ఎన్నో ప్రమాదకరమైన స్టంట్లను చేశారు. అక్షయ్‌ను భారతీయ జాకీచాన్ అంటుంటారు అభిమానులు. ఇప్పటికి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అక్షయ్‌ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.