అక్తర్‌కు పీసీబీ భారీ షాక్..
By తోట వంశీ కుమార్ Published on 30 April 2020 2:10 PM ISTపాకిస్ధాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఊహించని షాక్ ఇచ్చింది. ఇటీవల పాకిస్థాన్ క్రికెటర్లతో పాటు ఆదేశ బోర్డు పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న అక్తర్ పై పీసీబీ లీగల్ అడ్వైజర్ తఫాజ్జుల్ రిజ్వి పరువు నష్టం దావా వేశారు.
ఇటీవల పాకిస్థాన్ ఆటగాడు ఉమర్ అక్మల్ పై పీసీబీ నిషేదం విదించింది. తనను ఓ బుకీ కలిసిన విషయాన్ని అక్మల్ క్రికెట్ బోర్డుకు చెప్పనందుకు అతడిపై క్రమ శిక్షణా చర్యల కింద మూడేళ్ల పాటు పీసీబీ నిషేదం విదించింది. ఈ విషయం పై అక్తర్ తన యూ ట్యూబ్ వీడియో అభ్యంతరం వ్యక్తం చేశాడు. అక్మల్ మూడేళ్ల నిషేదంలో పీసీబీ లీగల్ అడ్వైజరీ తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టాడు. అక్మల్ కు సపోర్టుగా మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. దీంతో ఆగ్రహించిన పీసీబీ లీగల్ అడ్వైజర్ రిజ్వి.. అక్తర్ పై పరువు నష్టం కేసు వేశారు.
న్యాయపరమైన అంశాలపై మాట్లాడేటప్పుడు షోయబ్ అక్తర్ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీడియోలో అతడు వాడిన భాష ఏమాత్రం ఆమోద యోగ్యంగా లేదు. అందుకే పీసీబీ న్యాయ సలహాదారు మిస్టర్ తఫజ్జుల్ రిజ్వీ తన స్వంత అభీష్టానుసారం అక్తర్‌పై క్రిమినల్ కేసు పెట్టి పరువు నష్టం దావా వేశారు అని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఒక వేళ అక్తర్ గనుక ఈ కేసు ఓడిపోతే.. దాదాపు రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.