ఆమె ఒక ఎయిర్‌హోస్టెస్‌..పేరు కనిష్క. అయితే డబ్బు సంపాందించే మార్గాల్లో సులువైన మార్గాన్ని ఎంచుకుంది. దాని కోసం భర్తతో కలిసి హైదరాబాద్‌లోని ఓ వ్యాపారవేత్తను టార్గెట్‌ చేసింది. అతనితో ఫ్రెండ్‌షిప్ స్టార్ట్‌ చేసింది. దాదాపు మూడు నెలలకు పైగా హోటళ్లు, రిసాట్స్‌ తిరిగారు.అయితే ఇలా కనిష్కతో సన్నిహితంగా బయట తిరిగుతున్నప్పుడు..ఆమె భర్త ఫోటోలు, వీడియోలు తీశాడు. దంపతులిద్దరూ..కలిసి పక్కా ప్రణాళికతో స్సై ఆపరేషన్ చేశారు.

అయితే నెల రోజుల క్రితం కనిష్క..ఆ వ్యాపారవేత్తతో కలిసి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలోని రిసార్టుకు వెళ్లింది. అతని మత్తు మందు ఇచ్చింది. ఆ తర్వాత భార్యభర్త ఇద్దరు కలిసి ఓ సినిమా సీన్‌ క్రియేట్‌ చేశారు. కనిష్కను భర్త విజయ్ కుమార్ రక్తం వచ్చేట్లు కొట్టినట్టు, ఆమె ఒంటిపై స్వల్పగాయాలయ్యేట్లు చేసి.. ఆ గదిలో ఫర్నీచర్‌ను కూడా చిందర వందరగా చేశారు.

భార్యతో అడ్డంగా దొరికిన వ్యాపారి..
అయితే స్పృహలోకి వచ్చిన వ్యాపారిని కనిష్క, భర్త విజయ్‌కుమార్ బెదిరించాడు. ఆయనకు భయపడిన ఆ వ్యాపారి వెంటనే రూ.20 లక్షలలు స్పాట్‌లోనే తెప్పించి ఇచ్చాడు. పైగా మరో రూ. కోటికి షెక్‌ కూడా రాసిచ్చాడు. అయితే తన విషయం బయటపడదనుకున్న వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సైలెంట్‌ అయిపోయాడు.

మళ్లీ డబ్బులు కావాలి..?
మళ్లీ డబ్బులు కావాలంటూ.. విజయ్‌ కూమార్ నుంచి బెదిరింపులు ప్రారంభమయ్యాయి. దీంతో భరించలేక ఆ వ్యాపారవేత్త శంషాబాద్‌ డివిజన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు..హనీట్రాక్‌కు పాల్పడిన ఆ భర్యాభర్తలిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరి వలలో ఆ వ్యాపారియే కాకుండా..మరికొంత మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏకంగా అమెరికాలో నివసించే ఎన్‌ఆర్‌ న్యూడ్ వీడియోలను కనిష్క సేకరించి..బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు పోలీసులు విచారణలో వెల్లడించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.