బ్రేకింగ్: విమానాశ్రయంపై దాడి.. ఏడుగురు మృతి
By సుభాష్
ఇరాక్ లోని బాగ్దాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుపై రాకెట్ దాడి జరిగింది. శుక్రవారం ఉదయం ఎయిర్ కార్గో టెర్మినల్ సమీపంలోఈ దాడి జరిగింది. ఈ విమానాశ్రయంపై మూడు రాకెట్లతో దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, పలుకార్లు ధ్వంసం, పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. మృతుల్లో ఇరాక్, ఇరాన్ ఉన్నత స్థాయి కమాండర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఎలైట్ క్వాడ్స్ చీఫ్ జనరల్ ఖాసీం, ఇరాక్ అనుకూల మలీషియా కమాండర్ అబూ మహదీ అల్ మహండిస్ కూడా మృతి చెందినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
కాగా, ఈ దాడికి పాల్పడింది అమెరికా బలగాలేనని ఇరాక్ పీఎంఎఫ్ ప్రతినిధి అహ్మద్ అల్ అస్సాది ఆరోపించారు. అలాగే ఈ ఘటనపై యూఎస్ అధికారులు స్పందించారు. బాగ్దాద్‌లో ఇరాన్‌తో ముడిపడి ఉండటంతో ఈ దాడి జరిగినట్లు ఆయన అన్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలుసుకునే పనిలో ఉన్నామన్నారు. ఇక మరోవైపు మూడు రాకెట్లతో బాగ్దాద్ ఎయిర్‌పోర్టుపై దాడి జరిగిందని పారా మిలటరీ గ్రూప్స్ పేర్కొన్నాయి. ఈ దాడిలో ఇరాక్ పారా మిలటరి చెందిన ఐదుగురు సభ్యులు, ఇద్దరు అతిథులు ఉన్నట్లు వారు చెబుతున్నారు.