వణికించిన భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు

By సుభాష్  Published on  3 Jan 2020 3:16 AM GMT
వణికించిన భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు

జపాన్‌ దేశంలో భూకంపం వణికించింది. తూర్పు తీరంలోని హాసాకి పట్ణంలో రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 5.6గా నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. హాసాకీ పట్టణంలో 32 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని జియాలజికల్‌ సర్వే అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. కాగా, భూకంపం ఎంత ఆస్తినష్టం కలిగింది, ఎంత మంది మరణించారనేది ఇంకా తెలియాల్సి ఉంది. చాలా భవనాలు భూకంప ధాటికి నేలమట్టమైనట్లు తెలుస్తోంది. అధికారులు భూకంప ప్రాంతానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

Next Story