సంక్రాంతి తరువాత తిరుమలలో నో ప్లాస్టిక్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2019 10:59 PM ISTతిరుమల: తిరుమల తరహాలో తిరుపతిలోనూ దశలవారీగా మద్యపాన నిషేధం అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ విజ్ఞప్తి చేసింది. సంక్రాంతి తర్వాత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేందుకు నిర్ణయం తీసుకున్నారు. స్వామి వారి లడ్డూ ప్రసాదం తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామన్నారు. నిమ్స్ తరహాలో స్విమ్స్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. స్విమ్స్‌ను ఆధీనంలోకి తీసుకునేందుకు టీటీడీ ఆమోదముద్ర వేసింది. టిటిడి శాశ్వత ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.6,850 బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయించారు.
తిరుపతిలోని అలిపిరి వద్ద 200 పైచిలుకు ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి భక్తిధామం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో నీటి సమస్యను అరికట్టేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. మతమార్పిడులను అరికట్టేందుకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు శ్రీవాణి ట్రస్టు ద్వారా విరాళాలు సేకరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.