హైకోర్టు ముందు ఆందోళనకు దిగిన న్యాయవాదులు
By తోట వంశీ కుమార్Published on : 15 May 2020 6:56 PM IST

తెలంగాణ హైకోర్టు ముందు శుక్రవారం న్యాయవాదులు ఆందోళనకు దిగారు. 10సంవత్సరాల లోపు న్యాయవాదులకు మాత్రమే సాయం చేయాలన్న నిబంధనను తీసివేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయవాదులకు సాయం అందించడానికి ఎలాంటి నిబంధనలను విధించలేదని, అర్హులైన వారందరికి నగదును అందించాలని వారు కోరారు.
కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న యువ, పేద న్యాయవాదులకు సాయం అందించడానికి ప్రభుత్వం రూ.25కోట్ల మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Next Story