లాక్ డౌన్ లో అడవి శేష్ పరిస్థితి ఇది..!

By అంజి  Published on  6 April 2020 8:29 AM GMT
లాక్ డౌన్ లో అడవి శేష్ పరిస్థితి ఇది..!

లాక్ డౌన్ ప్రభావం చిత్ర పరిశ్రమ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎన్నో సినిమాలు ఆగిపోయాయి. టాలీవుడ్ మీద కూడా చాలా ప్రభావమే చూపింది లాక్ డౌన్. ప్రస్తుతం స్టార్స్ అందరూ తమ తమ ఇళ్లల్లో.. కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉన్నారు. ఇష్టమొచ్చిన సినిమాలు చూస్తూ, ఇంటి పనులు చేసుకుంటూ, పెంపుడు జంతువులతో ఆడుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ ఉన్నారు. లాక్ డౌన్ లో తాము ఏమేమి చేస్తున్నామో కూడా వివరిస్తూ ఉన్నారు.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినప్పుడు అడవి శేష్ మేజర్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. షూటింగ్ ఆపేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇంటికి చేరుకున్నాడు. ఈ ఖాళీ సమయంలో తనకు నచ్చిన పనులు చేసుకుంటూ.. కొత్త విషయాలను కూడా నేర్చుకుంటూ ఉన్నాడు. సోషల్ ఐసోలేషన్ అన్నది కష్టమే అయినప్పటికీ.. కొత్తవి తెలుసుకుంటూ నా మనసుతో కనెక్ట్ అవ్వడానికి సమయం దొరికిందని అడివి శేష్ తెలిపాడు.

సామాజిక దూరం అన్నది మనసు పైన ప్రభావం చూపిస్తుందని అడివి శేష్ అంటున్నాడు. ఈ ఖాళీ సమయంలో ఎక్విప్మెంట్ అన్నది లేకుండా జిమ్ చేయడం వంటివి నేర్చుకున్నానని తెలిపాడు. తనకు సాధారణంగా సినిమా హాల్ కు వెళ్లి.. టబ్ పాప్ కార్న్ తీసుకుని తింటూ ఎంజాయ్ చేయడాన్ని ఇష్టపడుతూ ఉంటానని.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వీలు పడదని.. దీంతో ఆన్ లైన్ లో తాను ఎప్పటి నుండో చూడాలని అనుకుంటున్న సినిమాలను చూస్తూ ఉన్నానని అన్నాడు.

ఆస్కార్ అవార్డు అందుకున్న పారాసైట్ సినిమాను చూశానని.. అద్భుతంగా అనిపించిందని అన్నాడు. అలాగే గాడ్ ఫాధర్ సినిమాకు సంబంధించిన సీక్వెల్ లను కూడా చూశానని అన్నాడు. క్లాసిక్ ను చూడడంలో వచ్చే కిక్కే వేరని అన్నాడు. అలాగే మణిరత్నం సినిమాలు కూడా చూస్తూ ఉన్నానని అన్నాడు. కొన్ని పుస్తకాలను చదవడం కూడా మొదలు పెట్టానని అన్నాడు.

తన రైటింగ్స్ మీద కూడా దృష్టి పెట్టానని అడివి శేష్ అంటున్నాడు. గూడాచారి-2 స్క్రిప్ట్ మీద దర్శకుడు రాహుల్ పాకాలతో కలిసి పని చేస్తూ ఉన్నానని అన్నాడు. వీలైనంత త్వరలో స్క్రిప్ట్ పనులను పూర్తీ చేయాలని అనుకుంటూ ఉన్నామని తెలిపాడు.

అమ్మ, సోదరి మరో చోట..

ఎన్నో పనులు చేసుకుంటూ ప్రస్తుతం బిజీ గా గడుపుతున్నా కూడా మనసులో ఎక్కడో ఒక చోట ఆందోళన అన్నది ఉంది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను తన తండ్రి ఒక చోట ఉంటే తన అమ్మ, సోదరి మరో చోట ఉన్నారని అన్నారు. మనం ఎంతగానో ప్రేమించే కుటుంబ సభ్యులు ఇలాంటి సమయంలో మన దగ్గర లేకుంటే చాలా బాధగా ఉంటుందని అన్నాడు.

లాక్ డౌన్ ఎత్తివేశాక కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నాడు. సోషల్ డిస్టెన్స్ మాత్రమే కాదు.. చాలా విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని అడివి శేష్ అంటున్నాడు. మనకేమవుతుంది అన్న నిర్లక్ష్యం అసలు పనికి రాదని.. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నాడు. ఎప్పటికప్పుడు చేతులను కడుక్కుంటూ సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు అడవి శేష్.

Next Story