తండ్రి సీఎం.. తనయుడు మంత్రి.. కానీ
By రాణి Published on 30 Dec 2019 4:14 PM ISTముఖ్యాంశాలు
- మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆదిత్య ఠాక్రే
సుమారు నెలన్నర క్రితం వెలువడిన మహారాష్ర్ట ఎన్నికల ఫలితాల్లో బీజేపీ(105 సీట్లు) పరాజయం పాలయ్యింది. శివసేనకు ఎన్సీపీ మద్దతివ్వడంతో మొత్తం 110 సీట్లు అంటే బీజేపీ పై 5 సీట్ల తేడాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఫలితాలొచ్చాక సీఎం సీటును శివసేనకు ఇచ్చేందుకు బీజేపీ వ్యతిరేకించడంతో, ఉద్ధవ్ ముఖ్యమంత్రి పదవిని చేపడితే మద్దతిస్తామని ఎన్సీపీ ప్రకటించింది. ఎన్సీపీ ప్రకటనతో అప్పటి వరకూ సీఎం అవుతాడనుకున్న ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. చేసేది లేక ఉద్ధవ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
ఎలాగైనా కుమారుడిని తన కేబినెట్ లో మంత్రిని చేయాలని భావించిన ఉద్ధవ్ అనుకున్నట్లుగానే కేబినెట్ లో స్థానం కల్పించారు. 29 ఏళ్ల ఈ యువ నాయకుడు వోర్లీ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థి సురేష్ పై 57,247 ఓట్ల ఆధిక్యంతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నేడు మహారాష్ర్ట మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఉద్ధవ్ కేబినెట్ లో ఆదిత్యకు ఏ శాఖకు సంబంధించిన బాధ్యతలు అప్పగిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
2014తో పోలిస్తే బీజేపీ ఓటు బ్యాంకు మహారాష్ర్టలో చాలా తగ్గిపోయినట్లుగా తెలుస్తోంది. 2014లో బీజేపీ 122 సీట్లు సాధిస్తే..2019లో 105సీట్లకే పరిమితమయింది.
2014, 2019లో మహారాష్ర్టలోని ఇతర పార్టీలు సాధించిన సీట్ల వివరాలు.
బీజేపీ | 122 | 105 |
కాంగ్రెస్ | 42 | 44 |
ఎన్సీపీ | 41 | 54 |
శివసేన | 63 | 56 |
ఇతరులు | 20 | 29 |