సిద్దిపేట అడిషనల్ ఎస్పీ అరెస్ట్..!
By సుభాష్Published on : 19 Dec 2019 8:11 PM IST

సిద్దిపేట అడిషన్ ఎస్పీ నర్సింహరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో రెండు రోజుల పాటు నర్సింహరెడ్డి ఇల్లు, బంధువులు, అలాగే బినామీల ఇళ్లలో ఏసీబీ దాడులు నిర్వహించింది. సిద్ధిపేట, హైదరాబాద్, మహబూబ్ నగర్, జహీరాబాద్, షాద్ నగర్ తదితర ప్రాంతాల్లో ఏసీబీ దాడులు చేసింది. ఈ దాడుల్లో కిల్లోన్నర బంగారం ,రూ. 5.3 లక్షలు, 6 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, గోల్కొండా లో విల్లా తో పాటు, శంకర్పల్లి లో 14 ప్లాట్స్, సిద్దిపేట, మహబూబ్ నగర్ లలో 20 ఎకరాల భూమి , 2 కార్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఇంకా 5 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఏసీబీ విచారణ తేలిది. ఆయను కోర్టులో హాజరు పర్చి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
Next Story