చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేసిన నటి స్నేహా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Aug 2020 12:10 PM GMT
చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేసిన నటి స్నేహా

కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దర్గయ్యారు స్నేహా. అభినయంలో మహానటి ఆమె. తెలుగు, తమిళం, కన్నడ, మలయాషం బాషల్లో నటించి మంచి గుర్తింపు సాధించింది. కెరీర్‌ పుల్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండగా.. నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. జనవరి 24న రెండో బిడ్డకు జన్మనిచ్చారు స్నేహా. పాప పుట్టి 7 నెలలు అవుతున్నా ఇంత వరకు ఆ చిన్నారిని ప్రపంచానికి చూపించలేదు. శుక్రవారం భర్త ప్రసన్న 38వ పుట్టిన రోజు సందర్భంగా తన చిట్టి తల్లిని ప్రపంచానికి పరిచయం చేసింది.

ఇక పాపకి ఆద్యంత అని పేరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు, అన్న విహాన్‌తో కలిసి ఉన్న చిన్నారి ఆద్యంత ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు స్నేహ. 'పుట్టిన రోజు శుభాకాంక్షలు టూ మై సోల్‌ మేట్‌.. మై లవర్‌ బాయ్‌.. గార్డియన్‌ ఏంజిల్‌.. సూపర్‌ డాడా. ఈ లడ్డులతో నా జీవితాన్ని అందంగా మలిచినందుకు ధన్యవాదాలు. సదా మనం ఉన్నతంగా ఉండాలని దీవించి.. శుభాకాంక్షలు తెలిపే వారికి ఈ రోజు నా చిట్టితల్లి ఆద్యంతను పరిచయం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది' అంటూ కుమార్తె ఫోటోలు షేర్‌ చేశారు స్నేహ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Next Story