పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన సీనియర్‌ నటి 'సితార'

By సుభాష్  Published on  8 May 2020 11:25 AM GMT
పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన సీనియర్‌ నటి సితార

సీనియర్‌ నటి అయినప్పటికీ ఎప్పటికి సింగిలేనని చెబుతోంది. ఆమె పేరే సితార. ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. ఆ తర్వాత తెలుగులో తల్లి, అక్క పాత్రలలలో కూడా నటించి మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. అలాగే కొన్ని సీరియల్స్‌లో కూడా నటించింది. అయితే ఆమెకు 47 ఏళ్ల వచ్చినా ఇప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. కుమారి మాత్రమే. ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడంపై అందరిని ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా చాలా సినిమాలే చేసింది. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, బృందావనం, భరత్‌ అనే నేను, లెజెండ్‌, అరవింద్‌ సమేత లాంటి మంచి హిట్‌ సినిమాల్లో నటించింది. ఆమె చేసిన ప్రతీ పాత్రకు జీవం పోసేలా నటించింది మెప్పించింది. అంతేకాదు ఇప్పటి కూడా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది.

కాగా, ఇన్నాళ్ల నుంచి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏమిటని అడిగితే ఒక్కముక్కలోనే చెప్పేసింది. తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిని కోల్పోవడం అని చెప్పేసింది.

నా తండ్రి చనిపోయిన తర్వాత ఒక్కరు పెళ్లి గురించి ఆలోచించలేదు. ఆ తర్వాత కూడా ఆలోచించలేదు అంటూ చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకునే సరైన వ్యక్తి దొరికితే వివాహం చేసుకుంటారా.. అని అడిగితే అలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చింది. లైఫ్‌లో పెళ్లి అంటూ చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. ఈ జీవితం అంతా తనకు తానే తోడుగా ఉంటానని చెబుతోంది సితార.

Next Story