సినీ నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టివేత.. !

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jun 2020 4:40 PM IST
సినీ నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టివేత.. !

ఇటీవల బారీగా మద్యం తరలిస్తూ పట్టుబడే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలా అక్రమంగా మద్యం తరలించే వారిలో రాజకీయ, ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టుబడింది. చెన్నైలోని ఈసీఆర్‌ రోడ్డులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రమ్యకృష్ణకు చెందిన ట‌యోటా ఇన్నోవా క్రిస్టా కారు( TN07Q 0099) అటుగా వ‌చ్చింది.

దీంతో ఆమె వాహానాన్ని కూడా పోలీసులు తనిఖీ చేశారు. కారులో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. కారులో 96బీర్‌ బాటిల్స్‌, 8 లిక్కర్‌ సీసాలు లభ్యం లభ్యం అయ్యాయి. కారులో భారీ మొత్తంలో మద్యం దొరకడంతో.. కారును సీజ్‌ చేసి డ్రైవర్‌ సెల్వకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. రమ్యకృష్ణ వచ్చి అతడిని బెయిల్‌ పై తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

అందం, అభినయంతో దశాబ్ధాలుగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు రమ్యకృష్ణ. బాహుబలిలో శివగామిగా నటించారు. దీంతో ఆమెకు అన్ని బాషల్లో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ పుల్‌ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. ఆమె కారులో మద్యం తరలించడం అనేది ఆమెకి తెలిసే జరిగిందా లేదా అని తెలుసుకునే ప్రయత్నంలో చెన్నై పోలీసులు ఉన్నారు.

Next Story