వావ్..ప్రగతి ఆంటీ తీన్ మార్ స్టెప్పులతో ఇరగదీసిందిగా..
By రాణి
ప్రగతి ఆంటి..టాలీవుడ్ లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అతి చిన్న వయసులోనే తల్లి లాంటి క్యారెక్టర్లో ఒదిగిపోయిన ప్రగతి..అమ్మ, అత్త, వదిన, అక్క వంటి పాత్రల్లో నటించారు అనే కన్నా జీవించారని చెప్పొచ్చు. ఇలాంటి పాత్రలకు ఆవిడకు ఆవిడే సాటి.
Also Read : ఏపీ కొత్త ఎస్ఈసీపై దుష్ప్రచారం
అసలు విషయానికొస్తే లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరికి వారు పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. జిమ్ లు అలవాటైన వారంతా ఇంట్లో ఉన్న కొన్ని కొన్ని పరికరాలతోనే వ్యాయామాలు చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సుపరిచితురాలైన ప్రగతి తన తీన్ మార్ డ్యాన్స్ తో అందరినీ ఆశ్చర్య పరిచింది. వైట్ షర్ట్, నిక్కర్ పై పంచ కట్టి..అచ్చమైన మాస్ లుక్ లో తీన్ మార్ స్టెప్పులేశారు. వావ్ ప్రగతి ఆంటీ..మీరు చాలా బాగా చేశారు, మీలో ఇంత టాలెంట్ ఉందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏమాటకామాట..నిజంగానే ప్రగతి తీన్ మాన్ డ్యాన్స్ తో ఇరగదీశారనే చెప్పాలి. మీరూ ఓ లుక్కేసి ప్రగతి ఆంటి తీన్ మార్ ఎలా ఉందో చెప్పండి.