'పూజా'కు కొపమొచ్చింది.. 'ఎయిర్‌టెల్'కు దుమ్ము దులిపింది
By సుభాష్ Published on 11 Feb 2020 8:45 PM ISTగ్లామర్‌తో ఆకట్టుకుంటున్న అందాల భామ పూజా హెగ్డే. మరి ఇంత పాపులర్ అయిన ఈ బ్యూటీ పాపకి కోపం వస్తే మమూలుగా ఉంటుందా ఏంటీ.. ట్విట్టర్ వేదికగా 'ఎయిర్‌టెల్ నెట్ వర్క్ వారికి క్లాస్ పీకేసింది. ఈ ముద్దుగుమ్మకు ఎయిర్‌టెల్‌పై ఎక్కడ లేనంతగా కోపమొచ్చేసింది. మరి ఈ బ్యూటీకి అంతకోపం ఎందుకొచ్చిందనేగా మీ అనుమానం.. ఇలాంటి కోపం అందరికి ఎదురయ్యేదే. దారుణమైన నెట్ వర్క్, చిరాకు పెట్టించే కస్టమర్ సర్వీస్, ఇష్టానుసారంగా వేసే బిల్లు.. అవన్నీ ఈ బుట్టబొమ్మకి చిరాకు పెట్టించాయి. చివరకు ఏం చేసిందంటే.. ట్విట్టర్‌లో ఘాటుగా మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ ఎయిర్‌టెల్ కంపెనీని ట్యాగ్ చేస్తూ తన ఫాలోయర్స్ అందరికి మరో నెట్ వర్క్ చేసుకోమని సలహా ఇచ్చింది.
ఇక పూజా హెగ్డే పెట్టిన మెసేజ్‌కు స్పందించిన ఎయిర్‌టెల్ వారు అమెను కాంటాక్ట్ చేశారట. దీంతో నెట్ వర్క్ ఉన్న సమస్యలపై వారి దృష్టికి తీసుకొచ్చిందట. వెంటనే ఆమె చెప్పిన సమస్యలన్నీ పరిష్కరించారట ఎయిర్‌టెల్ వారు. అంతేకాదు ట్విట్టర్ వేదికగా సారీ చెప్పారట. దీంతో కోపాన్ని తగ్గించుకున్న కన్నడ భామ మరో ట్విట్ చేస్తూ.. ఎయిర్ టెల్‌ను ఫెంటాస్టిక్ అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. ఇక అదే ట్విట్‌లో 'నా ఫిర్యాదు మిగతా ఎయిర్‌టెల్ వినియోగదారులందరికి మెరుగైన సేవలు అందడానికి ఎంతో తోడ్పిందని ఆశిస్తున్నాను' అటూ చెప్పుకొచ్చింది. పూజా హెగ్డే ట్విట్ చేయగానే స్పందించిన ఎయిర్‌టెల్ యాజమాన్యంపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఒక సెలబ్రిటీ చేస్తేనే స్పందిస్తారు తప్ప.. మిగతా వారు ఫిర్యాదు చేస్తే స్పందించరా..? అంటూ మండిపడ్డారు.