నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న 'నయనతార'
By సుభాష్ Published on 9 Feb 2020 4:58 PM ISTమళయాల ముద్దుగుమ్మ నయనతార. అటు కోలివుడ్, ఇటు టాలీవుడ్‌లో ఎంతో రాణిస్తూ ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ తమిళంలో చాలా బిజీబిజీగా ఉంది. అప్పుడప్పుడు తెలుగు సినిమాలు చేస్తున్నా.. ఇక్కడ మాత్రం క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాష్మోరా చిత్రం హిట్ కావడంతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది. ఈ భామ గతంలో ఇద్దరితో ప్రేమలో మునిగితేలి ఇప్పుడు ఇద్దరితోనూ తెగదెంపులు చేసుకుని తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్‌తో ప్రేమ ప్రయాణం కొనసాగిస్తోందట.
ఈ సమయంలో ఈ భామ నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందట. తాజాగా ఈ విషయాన్ని తమిళ నిర్మాత రాజన్ వెల్లడించారు. ఈ నిర్మాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ముఖ్యంగా నయనతార ఖర్చులు తెగ పెరిగిపోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ముద్దుగుమ్మ లగ్జరీ హోటళ్లలో బస చేయడం వల్ల కూడా వ్యక్తిగతంగా విపరీతంగా ఖర్చులు పెరిగిపోతున్నట్లు చెబుతున్నారు. నయనతారపై నిర్మాతలు ఇప్పటికే తెగ కోపంగా ఉన్నారట. ఎందుకంటే సినిమా ప్రమోషన్లకు ఈ అమ్మడు దూరంగా ఉంటోంది.
దీనిపై నిర్మాతలు ఏమి అనలేక సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఇప్పుడు ఈ నయనభామ చేస్తున్న దుబారా ఖర్చులపై నిర్మాతలు కూడా స్పందించే అవకాశాలు కూడా లేకపోలేదు. అంతే కాదు సినిమాల్లో చేయాలంటే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట. ఒక వైపు భారీ పారితోషకం డిమాండ్ చేయడం, మరో వైపు ఈమె కోసం ఖర్చులు కూడా భారీగా పెరిగిపోతున్నాయని వాపోతున్నారు నిర్మాతలు.