టాలీవుడ్ డ్రగ్స్ పార్టీలు.. నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Sept 2020 6:19 AM ISTటాలీవుడ్‌లో ఇండస్ట్రీలో జరిగే పార్టీలపై సినీనటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసుపై సీబీఐ విచారణ జరుగుతుండగా.. సుశాంత్ డ్రగ్స్ తీసుకొనే వారని ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్‌లో డ్రగ్స్ కల్చర్ ఉందని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో నటి కంగనా రనౌత్ తెలిపారు. దాదాపు అందరూ హీరోలు, హీరోయిన్లు, ప్రముఖులు పార్టీలలో డ్రగ్స్ వాడుతారని తీవ్ర ఆరోపణలు చేసింది. అలాగే శాండిల్‌వుడ్‌లోనూ డ్రగ్స్ వాడుతారంటూ ఓ జర్నలిస్ట్ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. తన వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పడంతో ప్రముఖలను భయాందోళనకు గురి చేస్తుంది.
ఊపందుకున్న ఉద్యమం.. సినిమాను బతికించుకుందాం.. సినిమా హాళ్లను తెరవనివ్వండి..!
ఇదిలా ఉంటే.. టాలీవుడ్ లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవని పేర్కొంటూ బాంబు పేల్చింది మాధవీలత. 'టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ వాడుతారు.. దీనిపై తెలంగా ఎన్‌సీబీ అధికారులు, ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి' అని ఫేస్‌బుక్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు మాధవీలత. మాధవీలత ఫేస్ బుక్‌లో ఏం పెట్టారంటే..
డ్రగ్స్ దందాలో మోదీ బయోపిక్ నిర్మాత పేరు
సుశాంత్ కేసు లో అడుగు పెట్టడం మంచిదే
బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం బాగా ఉంది అన్నది నిజం
కానీ ఇదిగో అదిగో అని ఫైనల్ గ తుస్సుమనిపిస్తారేమో నాకు డౌట్
ఎందుకంటే అంత బడా బాబులే కదా
అందులోను సినిమా రంగం ఇప్పటికే చెడ్డ పేరు అంటగట్టుకుంది
కానీ డ్రగ్స్ నేరం
ఒక పేదవాడికి అన్నం పెడతారో లేదో డ్రగ్స్ కి
1ప్యాకెట్ అంటారా గ్రాములు అంటారా?
ఎదో దానికి వేలు పెడతారు సరే అది వాళ్ళ ఇష్టం
ఇండియా లో పర్మిషన్ ఉన్నవి తినండి తాగండి
దేశానికి ఆదాయం పెంచుకుంటే పెంచుకోండి కానీ
ఇతర దేశాల మారక ద్యవ్యాలు ఎందుకు
ఆ మత్తులో జరిగే అరాచకాలు ఎవరు బయట పెట్టరు
అది సరే కానీ
తెలంగాణ NCBసార్లు మన టాలీవుడ్ మీద కూడా ఒక కన్నేయండి
పీతకన్నూ కాకుండా సీరియస్ కన్ను వేయండి
మన ఇండస్ట్రీ లో బాగా వాడుకలో ఉంది
అది లేకుండా కొన్ని పార్టీ లు జరగవు ఇక్కడ
2009 లో వచ్చారు పొలిటికల్ అండ తో వెనక్కి పోయారు
పాపం డీల్ చేసిన ఆఫీసర్ నోరు నొక్కేసి
Other Department కి పడేసారు
చట్టానికి చేతులు చాల పెద్దవి అందుకే అవి చాచితే విరగొడతారు
చాల దారుణాలు జరుగుతున్నాయి మత్తులో
1. సినిమా వాళ్ళు
2.పబ్స్
3. స్టూడెంట్స్
బాగా వాడుతూ మాదక ద్యవ్యాల వారికీ బాగా ఆదాయాన్ని పెంచుతున్నారు
కాస్త చూసి అదుపులో పెట్టండి ….
Disclaimer :-
ఆమ్మో నాకు భయం గా ఉంది ఈ పోస్ట్ పెట్టాను అని నన్ను ఎవరైనా బెదిరిస్తారేమో అని ఎవరు డ్రగ్స్ జోలికి పోరు ఆ అధికారులు కూడా చూసి చూడనట్లే ఉంటారు నిజం గ పట్టుకుంటే వాళ్ళకి భయం
ఒకవేళ పట్టుకున్న ప్రభుత్వాలు ఎలాగూ వదిలేయి అని బయపెడతాయి కదా ఆఫీసర్స్ ని
సరేలే నాకేమన్నా అయితే చట్టం చేతకానితనం అని నేనే కేసు పెట్టాల్సి వస్తది ఏమో. అని పోస్టు చేశారు మాధవీలత.