సీఎం జగన్ పై నటి ట్వీట్..ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

By రాణి  Published on  18 April 2020 11:00 AM GMT
సీఎం జగన్ పై నటి ట్వీట్..ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. ఈ విషయం తెలిసిన వైసీపీ వ్యతిరేక వర్గాలు అంతకుముందు జగన్ స్టేట్ మెంట్లను ఆధారంగా చేసుకుని..సీఎం కు కరోనా నెగిటివ్ వచ్చింది. వెంటనే కోవిడ్ ఆస్పత్రికి తరలించండి అంటూ నెట్టింట్లో ట్రోల్స్ మొదలు పెట్టారు.

ఈ విషయం పై ఓ జర్నలిస్ట్ ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేశారు. '' దక్షిణ కొరియా నుంచి తెప్పించిన రాపిడ్ యాంటీ బాడీ కిట్ తో ఏపీ సీఎం జగన్ కు కరోనా పరీక్షలు చేయగా..నెగిటివ్ వచ్చింది. '' అని ట్వీట్ చేయగా..నటి, సీరియల్ యాక్టర్ కస్తూరి శంకర్ బహుశా పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ బాగా పనిచేసి ఉంటాయ్ అని ట్వీట్ చేశారు.

Also Read : సోషల్ మీడియా పై ఉన్న పిచ్చే అతని ప్రాణాలు తీసింది

ఇది చూసిన నెటిజన్లు కాస్తా జగన్ పై మరిన్ని సెటైర్లు వేయడం మొదలు పెట్టారు. మధ్యలో వైసీపీ మద్దతు దారులు తగులుకుని ఆవిడ నటించే సీరియల్ ఇక ఎలా ప్రసారం అవుతుందో చూస్తామంటూ ఫైర్ అయ్యారు.

'ఛీ ఛీ మన పరువు పక్క రాష్ట్రం వాళ్లు కూడా తీసేస్తున్నారు' అని ఒకరు, 'ఆవిడ పొగుడు తోమ్ తోమ్ తోమ్...టే, మీరలా ట్రోల్ చెయ్యడం అస్సలు బాలేదు' అని ఇంకొకరు ఇలా వరుస ట్వీట్ చేయడం మొదలు పెట్టారు. ' మా తమిళులకు ధైర్యం ఎక్కువ సార్.' ' మన తెలుగు నటులు బుద్ధి తెచ్చుకోవాలి ఈ డేరింగ్ చూసి.' ఇలా ట్వీట్ల వర్షం కురుస్తోంది.

Also Read : వైద్య సిబ్బంది నిర్లక్ష్యం..నడిరోడ్డుపైనే మహిళ ప్రసవంNext Story
Share it