నటుడు విజయ్‌కాంత్‌కు కరోనా పాజిటివ్‌

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 24 Sept 2020 9:29 AM

నటుడు విజయ్‌కాంత్‌కు కరోనా పాజిటివ్‌

తమిళ నటుడు, డిఎండికే అధ్యక్షుడు విజయ్‌కాంత్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన చెన్నైలోని మియోట్‌ ఇంటర్నేషనల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. 'విజయకాంత్‌కు తేలికపాటి కరోనా లక్షణాలు వచ్చాయని .. ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు .ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుంటారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నాం ' అని మియోట్‌ ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌, డాక్టర్‌ పృథ్వీ మోహన్‌దాస్ గురువారం విడుదల చేసిన హెల్త్‌బులెటిన్‌లో వెల్లడించారు.

కాగా అంతకుముందు విజయకాంత్‌కు కరోనా లక్షణాలు మాత్రమే ఉన్నాయని డీఎండీకే పార్టీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా.. ఆయన ఆరు నెలలకు ఒకసారి సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారని.. ఈ క్రమంలో ఆస్పత్రికి వెళ్లిన ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం పళనిసామి సహా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.

Next Story