యువనటుడు నండూరి ఉదయ్‌ కిరణ్‌ (34) మృతి చెందాడు. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. ఉదయ్‌ కిరణ్‌ పార్ధివ దేహానికి పలువురు సినీనటుడు, రాజకీయ నేతలు శ్రద్దాంజలి ఘటించారు.

పరారే, ఫ్రెండ్స్‌ బుక్‌ సినిమాల్లో హీరోగా నటించిన ఉదయ్‌ కిరణ్‌.. పలు తమిళ సినిమాల్లో కూడా నటించారు. పలు వివాదాల్లో చిక్కిన సందర్భాలున్నాయి. 2016లో జూబ్లీహిల్స్‌ లోని ఓవర్‌ ద మూన్‌ పబ్‌లో గొడవలు చేయడంలో పోలీసులు అరెస్టు చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఉదయ్‌.. పలు నేరాలకు పాల్పడినట్లు అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేశారు.

అలాగే డ్రగ్స్‌ కేసులోనూ అరెస్ట్‌ అయి జైలు పాలయ్యాడు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి కాకినాడకు చెందిన ఓ మహిళను మోసం చేసిన కేసులో కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 59లోని నందగిరిహిల్స్‌ లో ఇంటి యజమానిపై దాడి చేయడంతో 2018లో ఉదయ్‌ కిరణ్‌ పై క్రిమినల్‌ కేసు నమోదైంది. తర్వాత మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.