కమెడీయన్‌ సునీల్‌కు అస్వస్థత.. ఆందోళనలో అభిమానులు

By సుభాష్  Published on  23 Jan 2020 7:18 AM GMT
కమెడీయన్‌ సునీల్‌కు అస్వస్థత.. ఆందోళనలో అభిమానులు

టాలీవుడ్‌లో నవ్వులు పండించే ప్రముఖ కమెడీయన్‌, నటుడు సునీల్‌కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న సునీల్ ను కుటుంబీకులు గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చేరారు. సునీల్‌ లివర్‌, గొంతు సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. సునీల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలిసి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

కాగా, సునీల్‌ తాజాగా నటించిన రవితేజ మూవీ 'డిస్కోరాజా' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. సునీల్‌ ఆరోగ్యం మెరుగు పడాలని అభిమానులు కోరుతున్నారు. హస్యనటుడిగా తన ప్రయాణం సాగించిన సునీల్‌.. అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'మర్యాద రామన్న' ఈ సినిమాతో హిట్‌ కొట్టేశాడు. ముందుగా మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్న సునీల్‌..తర్వాత హీరోగా అవతారమెత్తాడు. అటు కమెడీయన్‌గా, ఇటు హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక 'కలర్‌ ఫోటో' అనే సినిమాలో సునీల్‌ విలన్‌ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

Next Story