షాకింగ్ విషయాలు బయటపెట్టిన కమెడీయన్ రాహుల్ రామకృష్ణ

By సుభాష్  Published on  22 Jan 2020 2:15 PM GMT
షాకింగ్ విషయాలు బయటపెట్టిన కమెడీయన్ రాహుల్ రామకృష్ణ

కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ.. ఇతని పేరు ఇప్పుడు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే 2014లో 'సైన్మా' అనే షార్ట్‌ ఫలింతో చాలా పాపులర్‌ రాహుల్‌ అయ్యాడు. తర్వాత 2016లో 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాతో నటుడిగా, డైలాక్‌ రైటర్‌గా మారాడు. కానీ కొన్ని రోజుల తర్వాత బ్రేక్‌ వచ్చినా.. 'అర్జున్‌రెడ్డి', 'గీతాగోవిందం' సినిమాలతో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అతని తెలంగాణ యాస, కామెడీకి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత రాహుల్‌కు వరుసగా సినిమాల్లో అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఆయన షాకింగ్‌ విషయాలను బయటపెట్టాడు. వ్యక్తిగత విషయాలను తెలియజేస్తూ బహిర్గతం చేసేశాడు రాహుల్‌ రామకృష్ణ. తనపై చిన్నప్పుడు రేప్‌ జరిగిందని, తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నాడు.

''నన్ను చిన్నప్పుడు రేప్‌ చేశారు. నా బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. అందుకే ట్విట్టర్ వేదికగా చెప్పుకొస్తున్నాను. ఇలా ఇతరులకు నా విషయాలు పంచుకోవడం వల్ల నేనెంటో తెలుసుకోగల్గుతున్నాను. అన్నీ విషయాలు బాధగానే ఉంటాయి'' అని పేర్కొన్నారు. రాహుల్‌ రామకృష్ణ ట్విట్టర్‌ ద్వారా చెప్పుకొచ్చిన విషయాలను చూసి అభిమానులు షాక్‌ గురయ్యారు. ఈ ట్విట్‌ను చూసిన అభిమానులు రాహుల్‌కు ధైర్యం చెబుతూ ట్విట్‌ చేస్తున్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో అందరికి నవ్వులు పంచే వ్యక్తి వెనుక ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావడం చాలా బాధకరమని చెప్పుకొచ్చారు.Next Story
Share it