అరె.. యాక్షన్ అంటేనే భయపడుతోన్న యాక్షన్ హీరో !   

By సుభాష్  Published on  27 Dec 2019 10:24 AM IST
అరె.. యాక్షన్ అంటేనే భయపడుతోన్న యాక్షన్ హీరో !   

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్‌ లో సడెన్ గా మార్పు వచ్చేసింది. మార్పు అంటే గెటప్ లో కాదు, మైండ్ సెట్ లో. నిజానికి యాక్షన్ తప్ప తనకు ఏది సెట్ అవ్వదని బలంగా నమ్మే గోపీచంద్ లో ఇప్పుడు యాక్షన్ అంటేనే నచ్చట్లేదట. ఓవర్ గా యాక్షన్ వద్దు అంటున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలో వెళ్తే.. గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్ గా డైరెక్టర్ సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా నటిస్తోంది.

కాగా బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో సాగే ఈ చిత్రంలో కొన్ని చోట్ల ఓవర్ గా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని... ఆ యాక్షన్ సీక్వెన్స్ ను తగ్గించమని.. అలాగే చిత్రంలో పక్కా కామెడీ సీక్వెన్స్ ను హైలెట్ అయ్యే విధంగా స్క్రిప్ట్ ను ప్లాన్ చేయమని చెబుతున్నాడట. అలాగే బడ్జెట్ ను కూడా తగ్గిస్తే మంచిదని గోపీచంద్ సంపంత్ నందికి చెప్పాడట. చాణక్య రిజల్ట్ చూశాక.. సినిమాకి ఓవర్ బడ్జెట్ పెట్టి అది రాబట్టలేక చివరికి ప్లాప్ అనిపించుకోవడం గోపీచంద్ ఇష్టపడట్లేదని.. అందుకే ముందుగానే బడ్జెట్ తగ్గించుకుని సేఫ్ పొజిషన్ లో ఉండటం బెటర్ అని గోపీచంద్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది.

అందుకే సంపత్ నంది బడ్జెట్ తగ్గించడానికి స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశాడట. అదేవిధంగా కామెడీ కోసం గోపీచంద్ పాత్రను చాలా కొత్తగా మలిచారని... గోపిచంద్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. ఆ పాత్రలోని వేరియేషన్స్ కారణంగానే సినిమాలో కామెడీ బాగా వస్తోందట. అయితే గోపీచంద్ - సంపత్ నంది కలయికలో వచ్చిన గౌతమ్ నంద సినిమా ప్లాప్ అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడట.

Next Story