విశాఖపట్నం జిల్లాలో ఓ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి తీవ్ర కలకలం రేపింది. పెందుర్తికి చెందిన ఇంటర్మీడియేట్‌ చదువుతున్న విద్యార్థిని ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ రాసేందుకు బుధవారం బాలాజీ జూనియర్‌ కళాశాల వెళ్లింది. ఎగ్జామ్‌ ముగిసిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుండగా, ఓ యువకుడు యాసిడ్‌తో దాడికి పాల్పడ్డాడు. దీంతో గమనించిన కళాశాల సిబ్బంది బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాసిడ్‌ పోసిన యువకున్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరి మధ్య ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సుభాష్

.

Next Story