చంద్రబాబు కాన్వాయ్‌కి ప్రమాదం.. తృటిలో తప్పిన ప్రమాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Sep 2020 1:05 PM GMT
చంద్రబాబు కాన్వాయ్‌కి ప్రమాదం.. తృటిలో తప్పిన ప్రమాదం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని వాహనం ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో ఆయన వస్తుండగా ఓ ఆవు కాన్వాయ్‌కి అడ్డురావడంతో ఎస్కార్ట్‌ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో కాన్వాయ్‌లోని జామర్‌ వాహనాన్ని ఎన్‌ఎస్‌జీ2 వాహనం ఢీ కొట్టింది. ఆ వాహనం మొరాయించడంతో 15 నిమిషాల పాటు చంద్రబాబు రోడ్డుపైనే ఆగిపోయారు.

ఈ ప్రమాదం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చోటు చేసుకుంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న వాహనం బుల్లెట్‌ ప్రూఫ్‌ కావడంతో ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. సిబ్బందికి స్వల్ప గాయాలు కావడంతో మరో వాహనంలో వారిని తరలించారు.అనంతరం కాన్వాయ్‌ అక్కడి నుంచి హైదరాబాద్ వైపు కదిలింది.

Next Story