కర్నూలు : జిల్లా కేంద్రంలోని ఓర్వకల్లు మండలం  రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా విధులునిర్వహిస్తున్నారు నరాల సంజీవ రెడ్డి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదుతో ఏసీబీ ఆయన ఇంట్లో సోదాలు చేసింది. ఏకకాలంలో పలు చోట్ల సోదాలు చేశారు.  కర్నూలులోని ధనలక్ష్మి నగర్ లోని జరిపిన సోదాల్లో ఎస్బీఐ కాలర్ కీ, రూ.16 లక్షలు విలువ చేసే స్థలం డాక్యుమెంట్లు, కొత్త పల్లిలో ఎకరా 4 సెంట్లు అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నరాల సంజీవ రెడ్డిఅత్తమామల  గ్రామమైన మోత్కురులో కూడా ఏసీబీ సోదాలు  చేస్తున్నారు. పసుపుల ఒక ఇంటి సైట్ కూడా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. కోటి 50   లక్షలు విలువ చేసే డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.