మోటర్‌ వెహికల్ ఇన్‌ స్పెక్టర్‌ ఇంట్లో ఏసీబీ తనిఖీలు..అక్రమాస్తులు గుర్తింపు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 1:39 PM IST
మోటర్‌ వెహికల్ ఇన్‌ స్పెక్టర్‌ ఇంట్లో ఏసీబీ తనిఖీలు..అక్రమాస్తులు గుర్తింపు

కర్నూలు : మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ శివప్రసాద్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో సోదాలు అధికారులు సోదాలు చేశారు. కర్నూలు సహా ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలకు దిగారు. హైదరాబాద్, బెంగళూరు, తాడిపత్రి ఇక..పలు ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో రూ.80 కోట్ల వరకు అక్రమ ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. శివ ప్రసాద్ భార్య పేరు మీద రెండు షూట్ కేస్ కంపెనీలను కూడా అధికారులు గుర్తించారు. బెంగళూరులో G+7 అపార్ట్ మెంట్ ఉన్నట్లు అధికారులు తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోనూ అపార్ట్‌మెంట్ ఉన్నట్లు గుర్తించారు. ఇక..కర్నూలులోని శివప్రసాద్ ఇంట్లో కేజీకి పైగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు..ఉగాండాలోనూ బ్యాంక్ ఖాతా ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో బ్యాంక్ లాకర్‌ ఉన్నట్లు అధికారుల సోదాల్లో తేలింది. అంతేకాదు..ఒక కారు, లక్ష నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story