రూ.59 లక్షలు పలికిన అబ్రహం లింకన్ వెంట్రుకలు
By సుభాష్ Published on 14 Sept 2020 3:19 PM IST![రూ.59 లక్షలు పలికిన అబ్రహం లింకన్ వెంట్రుకలు రూ.59 లక్షలు పలికిన అబ్రహం లింకన్ వెంట్రుకలు](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/09/Abraham-lincon-Hair-auction.jpg)
అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌కు చెందిన కొన్ని వెంట్రుకలు, రక్తపు మరకల టెలిగ్రామ్‌ను వేలం వేశారు. ఈ వేలం పాటలో ఓ వ్యక్తి 81 వేల డాలర్లు (59లక్షలు)లకు దక్కించుకున్నాడు. లింకన్ జుట్టు ఇప్పటికి చెక్కుచెదరకుండా అలానే ఉంది. ఆర్‌ఆర్ ఆక్షన్ ఆఫ్ బోస్టన్ అనే సంస్థ ఈ వేల పాటను నిర్వహించింది. ఈ వేలం శనివారం ముగిసింది. అబ్రహం లింకన్ 1865లో హత్యకు గురయ్యాడు. వాషింగ్టన్ డీసీలోని ఫోర్ట్ థియేటర్ వద్ద జాన్ లిక్స్ బూత్ అనే వ్యక్తి లింకన్‌ను హత్య చేశాడు.
అయితే లింకన్‌కు పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో ఐదు సెంటీమీటర్ల పొడవుతో కొన్ని వెంట్రుకలు కత్తిరించి వైద్యులు భద్రపరిచారు. అనంతరం వాటిని 1865, ఏప్రిల్ 14న రాత్రి 11 గంటలకు ఈ టెలిగ్రామ్ లింకన్ సహాయకుడికి చేరవేశారు. ఆ తర్వాత లింకన్ వెంట్రుకలు, టెలిగ్రామ్ లింకన్ భార్య మేరిటోడ్, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే వీటిని మొదటిసారి 1999లో వేలం వేశారు. ఈ టెలిగ్రామ్‌కు ఘనమైన చరిత్ర ఉంది. లింకన్‌కు ఆయన సెక్రెటరీ ఎడ్విన్ స్టాన్‌టన్‌కు మధ్య రాజకీయ విభేదాలున్నాయని, ఆ కారణంగా లింకన్‌ను చంపేందుకు ప్లాన్ వేసినట్లు చరిత్రకారుల వాదనను ఈ టెలిగ్రామ్ తప్పని నిరూపిస్తోంది. అయితే నాటి నుంచి సదరు వెంట్రుకల క్లిప్పింగ్ 1945 వరకు తమ ఆధీనంలోనే ఉందని డాక్టర్ లోడ్ తనయుడు జేమ్స్ టోడ్ తెలిపారు. దానిని 1999లో విక్రమించారని ఆర్‌ఆర్ ఆక్షన్ తెలిపింది.