ఈ 'బుట్టబొమ్మ' గురించి ఎవ్వరికి తెలియని విషయాలు..
By సుభాష్ Published on 7 Feb 2020 4:21 PM ISTపూజా హెగ్డే.. ఈ అమ్మడు పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. నాగ చైతన్య హీరోగా నటించిన 'ఒక లైలా కోసం' మూవీతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ .. ఆ తర్వాత వరుణ్ హీరోగా 'ముకుందా' సినిమాతో గోపికమ్మ పాటతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించింది.
పూజాహెగ్డే 1990, అక్టోబర్ 13న ముంబైలో జన్మించింది. తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. పూజా ముంబైలో పుట్టినా..తల్లిదండ్రుల స్వస్థలం మాత్రం కర్ణాటకలోని మంగుళూరు. పూజా మాతృభాష ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, అలాగే కొద్దిగా కన్నడ, తమిళ్ మాట్లాడగలదట. ఇక పూజా భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకుంది. పూజా తండ్రి మంజునాథ్ వ్యాపార వేత్త. తల్లి లత క్యూనెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు. దీంతో పూజా హెగ్డే కూడా చిన్ననాటి నుంచి నెట్ వర్క్ మార్కెటింగ్‌లో చాలా మెళుకువులు అలవర్చుకుంది.
ఇక ముంబైలోని ఎంఎకే కళాశాలలో కామర్స్ లో ఉన్నత విద్య చదివిన ఈ భామ .. ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ లో డాన్స్ షోస్, ఫ్యాషన్ షోలలో పాల్గొంది. మిస్ ఇండియా పోటీలలో 2009లో పాల్గొని మొదటి రౌండ్‌లోనే ఎలిమినేట్ అయిపోయింది. కాగా, 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి జరిగిన అందాల పోటీలలో రెండో స్థానంలో నిలిచింది.
బిర్యానీ, పిజ్జాలను ఎక్కువగా ఇష్టపడే ఈ ముద్దుగుమ్మ.. కనీసం రోజూ రెండు గంటలు యోగాకు కేటాయిస్తుంది. తన బరువును ఎప్పుడు అదుపులో ఉంచుకునే ఈ బ్యూటీ బరువు 53 కిలోలు. ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. అంతేకాదు ఈ భామ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్‌లను ఆరాధిస్తుంది. ఇకపోతే ఏఆర్ రెహ్మన్ సంగీతానికి, జెన్సిఫర్ లోపెజ్ పాటలకు పెద్ద అభిమాని. ఇంకా సినిమాల పరంగా చూస్తే.. హృతిక్‌రోషన్, అమీర్ ఖాన్ సినిమాలు ఎక్కువ ఇష్టపడుతుందట.
ఖాళీ సమయంలో డ్యాన్స్, పుస్తకాలు చదవడం లాంటివి చేస్తుంటుంది. మూగ జీవాలకు సేవ చేస్తుంటుందట. పూజాకు ఏదైన కష్టం వస్తే 15 నిమిషాల పాటు ఏడుస్తుందట. ఎందుకంటే ఆ తర్వాత ఆ కష్టం నుంచి వచ్చే నెగెటివ్ ఆలోచనలు అన్ని పోతాయట. పూజా ఎక్కువ ఇష్టపడే ఓప్రా విన్ ఫ్రే నుంచి ఈ టెక్నిక్ నేర్చుకుందట. ఈ టెక్నికే స్టార్ చేసిందని చెప్పుకుంటోంది. పూజా ఖరీదైన వస్తువులు, బట్టలు ఇష్టపడుతుందట. అలా అని ఎక్కువగా షాపింగ్ కూడా చెయ్యదట.