అక్కినేని అఖిల్ సినిమా ఎంత వ‌ర‌కు వ‌చ్చింది..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2019 5:31 AM GMT
అక్కినేని అఖిల్ సినిమా ఎంత వ‌ర‌కు వ‌చ్చింది..?

అక్కినేని అఖిల్ తొలి చిత్రం 'అఖిల్' ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేదు. ఆత‌ర్వాత చేసిన 'హ‌లో', 'మిస్ట‌ర్ మ‌జ్ను' సినిమాలు కూడా ఫ‌ర‌వాలేదు అనిపించాయి కానీ... స‌క్స‌స్‌ని ఇవ్వ‌లేదు. దీంతో ఆలోచ‌న‌లో ప‌డిన అఖిల్ చాలా క‌థ‌లు విని ఆఖ‌రికి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో అఖిల్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది.

ఈ సినిమా హైద‌రాబాద్‌లో షూటింగ్‌ ప్రారంభం అయ్యింద‌నే వార్త త‌ప్పితే... ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా గురించి ఎలాంటి స‌మాచారాన్ని ఇవ్వ‌లేదు చిత్ర యూనిట్. ఇంత‌కీ తెలిసింది ఏంటంటే... ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ఫారిన్‌లో జరగనుందని సమాచారం. సౌదీ అరేబియాలో షూటింగ్‌ ప్లాన్‌ చేశారట. అక్కడ ఓ యాక్షన్‌ సీక్వెన్స్, పాటను చిత్రీకరించబోతున్నారని తెలిసింది.

ఈ షెడ్యూల్‌ దాదాపు పది రోజులు ఉంటుంద‌ట‌. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు, వాసు వ‌ర్మ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై అఖిల్ తో పాటు అక్కినేని అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి.. ఈ సినిమా అయినా అఖిల్ కి ఆశించిన విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.

Next Story
Share it