ఆబిడ్స్ లో స్కూలు ఆటో బోల్తా..విద్యార్దులకు గాయాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Sep 2019 10:57 AM GMT
ఆబిడ్స్ లో స్కూలు ఆటో బోల్తా..విద్యార్దులకు గాయాలు

హైదరాబాద్ : ఆబిడ్స్ లో మంగళవారం ఉదయం పిల్లల్ని స్కూళ్లకు తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఏడుగురు పిల్లల్ని అబిడ్స్ గ్రామర్ స్కూల్ కు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఓ బైక్ ఎదురు నుంచి వచ్చి ఆటోను ఢీ కొట్టింది. డ్రైవర్ వెంటనే బ్రేక్ వేయగా ఆటో బోల్తా పడింది. దీనితో ఆటో లో ప్రయాణిస్తున్న పిల్లలకి గాయాలు అయ్యాయి. పిల్లలందరూ స్వల్ప గాయాలతో బయట పడ్డట్టు తెలుస్తోంది.

ఈ ఘటన గురించి సామాజిక కార్యకర్త అచ్యుత రావు మాట్లాడుతూ "చట్ట ప్రకారం విద్యార్ధులు సురక్షితమైన ప్రయాణం చేస్తున్నారా... లేదా అని చూడాల్సిన బాధ్యత స్కూళ్ల పై ఉందన్నారు. ముఖ్యంగా ఉదయం ఆబిడ్స్ రోడ్లపైన దారుణమైన ట్రాఫిక్ ఉంటుంది. అటువంటి దారిలో పిల్లలతో నిండిన ఆటో రావడం కష్టమైన పని అని ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయన్నారు."

Next Story