అభిషేక్‌ బచ్చన్‌కు కరోనా నెగిటివ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Aug 2020 11:34 AM GMT
అభిషేక్‌ బచ్చన్‌కు కరోనా నెగిటివ్‌

బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ కరోనా వైరస్‌పై ఎట్టకేలకు విజయం సాధించారు. గత కొంతకాలంగా కరోనాతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అభిషేక్‌ బచ్చన్‌కు శనివారం చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని అభిషేక్‌ బచ్చన్‌ స్వయంగా వెల్లడించాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిందని, తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు అభిషేక్‌ ట్వీట్‌ చేశారు.

‘ప్రామిస్‌‌ ఈజ్‌ ఏ ప్రామిస్‌! ఈ మధ్యాహ్నం నాకు కరోనా టెస్టు చేయగా నెగెటివ్ అని వచ్చింది. ఈ వైరస్ ను జయిస్తానని మీకు ముందే చెప్పాను. నాకోసం, నా కుటుంబం క్షేమం కోసం ప్రార్థనలు చేసినవారందరికీ కృతజ్ఞతలు. నానావతి ఆసుపత్రిలో చికిత్స అందించిన డాక్టర్లకు, నర్సులకు, వైద్య సిబ్బంది అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. థాంక్యూ!" అని ట్వీట్‌ చేశారు.

బచ్చన్ కుటుంబంలో జయా బచ్చన్‌ మినహా అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య, ఆరాధ్య అందరూ వైరస్‌ బారిన పడ్డారు. ముందుగా.. అభిషేక్‌, అమితాబ్‌లు ఒకేసారి కరోనా బారిన పడ్డారు. వీరి అనంతరం ఐశ్వర్య రాయ్‌, ఆరాధ్యకు కూడా కరోనా సోకింది. దీంతో వీరంతా నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ముందుగా.. ఐశ్వర్యారాయ్‌, ఆమె కుమారై ఆరాధ్య డిశ్చార్జ్‌ కాగా.. అనంతరం అమితాబ్‌ బచ్చన్‌ డిశ్చార్‌ అయ్యారు. చివరగా.. నేడు అభిషేక్‌ బచ్చన్‌ కూడా డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో అమితాబ్‌ కుటుంబ కరోనాను జయించినట్లైంది.Next Story