1998లో వరుస బాంబు పేలుళ్ల విషయంలో అబ్దుల్ కరీంతుండాను నిర్దోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం తుది తీర్పునిచ్చింది. వరుస బాంబు పేలుళ్ల కేసులో తుండా పాత్ర ఉందని చెబుతూ వస్తున్న పోలీసులు అందుకు తగిన సాక్ష్యాలను సమర్పించకపోవడంతో తుండాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. డిఫెన్స్‌ వాదనతో ఏకీభవించిన కోర్టు.. గత 6 సంవత్సరాలుగా కొనసాగుతున్న తుండా కేసులో కీలక తీర్పు వెలువరించింది.

నిజానికి ఈ కేసులో తీర్పును గత నెల 18న వెల్లడించాల్సి ఉంది. కానీ, ఈ కేసును విచారణ జరుపుతున్న న్యాయమూర్తి సెలవులో ఉండడంతో తీర్పును మార్చి 3కు వాయిదా వేశారు. తొలుత ఇతని కేసులో నాంపల్లి కోర్టు ఫిబ్రవరి 4న విచారణ జరిపింది. ప్రస్తుతం కరీం తుండా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ జైలులో ఉన్నాడు.

1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా దేశ వ్యాప్తంగా అల్లర్లు జరగడమే కాదు, బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారు. ఇందులో భాగంగా టిఫిన్ బాక్సుల్లో బాంబులు అమర్చి హైదరాబాద్ లోని హుమాయున్ నగర్, సీసీఎస్ వద్ద, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసానికి కుట్ర పన్నాడని ఆరోపిస్తూ నాడు పోలీసులు కేసులు నమోదు చేశారు.

Next Story